ఒవైసీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాల్సిందే: వీహెచ్‌పీ

18 వ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణం చేసే ఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన జై పాలస్థిన్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Update: 2024-06-30 10:13 GMT

దిశ, వెబ్ డెస్క్: 18 వ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణం చేసే ఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన జై పాలస్థిన్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశ పార్లమెంట్ లో పరాయి దేశానికి జై కొట్టడం ఎంటని ఒవైసీకి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు, జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం మధ్యహ్నం ఢిల్లీ వీహెచ్‌పీ నేతలు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఒవైసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీగా వచ్చిన వారిని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో గుమిగూడిన విహెచ్‌పీ, బజరంగ్‌దళ్ ఒవైసీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.

Similar News