Joe Biden: పుతిన్ కుట్రను భగ్నం చేసింది అమెరికానే..!

అమెరికా, దాని మిత్రదేశాలు ఉక్రెయిన్ ని వదిలి వెళ్లలేవని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్(Joe Biden) అన్నారు.

Update: 2025-01-14 10:03 GMT
Joe Biden: పుతిన్ కుట్రను భగ్నం చేసింది అమెరికానే..!
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా, దాని మిత్రదేశాలు ఉక్రెయిన్ ని వదిలి వెళ్లలేవని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్(Joe Biden) అన్నారు. కొన్నిరోజుల్లోనే కీవ్ ని స్వాధీనం చేసుకోవాలన్న పుతిన్ ప్లాన్ ను తమ కార్యవర్గం భగ్నం చేసిందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ విదేశాంగ నీతిపై ఆఖరి ప్రసంగాన్ని చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం మొదలైన నాటినుంచి తాను కీవ్‌లో నిలబడ్డానని.. పుతిన్‌ కాదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు బేషరతుగా మద్దతు ఇచ్చామన్నారు. పదవీ విరమణ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు రష్యా, చైనా మరియు ఇరాన్‌లను లక్ష్యంగా చేసుకుని.. తన అంతర్జాతీయ వారసత్వాన్ని గురించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌కు మద్దతును కొనసాగించాలని పశ్చిమ దేశాలను కోరారు.

చైనా అంశపైం..

ఇక చైనా అంశాన్ని కూడా బైడెన్ ప్రస్తావించారు. . డ్రాగన్‌ ప్రభావం విస్తరించడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. బీజింగ్‌ ప్రస్తుత వేగం చూస్తే ఎప్పటికీ అమెరికాను దాటిపోలేదన్నారు. తమ కార్యవర్గం అమెరికా-చైనా సంబంధాలను జాగ్రత్తగా నిర్వహించిందన్నారు. ఉద్రిక్తతలు ఉన్నా.. ఎప్పుడూ సంక్షోభం మాత్రం రాలేదన్నారు. గాజా యుద్ధం గురించి మాత్రం మితంగానే మాట్లాడారు. గాజాలో బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి చాలా దగ్గరగా ఉన్నట్లు తెలిపారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా దళాలు వెనక్కి రావడంపైనా మాట్లాడారు. యుద్ధం ముగించడమే సరైన పని.. ఇది చరిత్రే చెబుతుందన్నారు. ఇక రానున్న ట్రంప్‌ కార్యవర్గం గ్రీన్‌ ఎనర్జీ పాలసీలను కొనసాగించాలని బైడెన్‌ కోరారు.

Tags:    

Similar News