ప్లాన్ ప్రకారమే యూపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్
ఈ పేపర్ లీక్ వ్యవహారం ప్రణాళిక ప్రకారం జరిగిందని ఇన్‌స్పెక్టర్ రామ్‌బాబు పేర్కొన్నారు
దిశ, నేషనల్ బ్యూరో: యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ పేపర్ లీక్ వ్యవహారం ప్రణాళిక ప్రకారం జరిగిందని ఇన్‌స్పెక్టర్ రామ్‌బాబు పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పరీక్షా కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచిన అభ్యర్థి మొబైల్‌ను తనిఖీ చేయగా, నీరజ్ అనే వ్యక్తి నంబర్ నుంచి అతని వాట్సాప్‌లో మధ్యాహ్నం 12:56 గంటలకు చేతిరాతతో సమాధానాలు వచ్చాయి. మ్యాచింగ్ సెంటర్‌లో ఇచ్చిన ప్రశ్నాపత్రంతో, వాట్సాప్‌లో పంపిన సమాధానాలన్నీ ప్రశ్నపత్రంతో సరిపోలినట్టు తెలిపారు. ఆరోజు పంపిన సమాధానాలు సాయంత్రం షిఫ్ట్ ప్రశ్నపత్రాల సంఖ్యకు భిన్నంగా ఉన్నాయి. అయితే అన్ని ప్రశ్నలూ సమాధానాలతో సరిపోలాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 18వ తేదీ రెండో షిప్టులో జరిగిన ఈ పరీక్ష పేపర్ పక్కా ప్రణాళికాబద్ధంగా లీక్ అయిందని రామ్‌బాబు వెల్లడించారు.