రాహుల్ గాంధీ పై నిప్పులు చెరిగిన కేంద్ర స్మృతి ఇరానీ
పార్లమెంట్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మణిపూర్ అల్లర్లపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చేరింది. ప్రధాని మోడీ రావణాసురిడి వల్లే అహంకారంతో మణిపూర్ కాలిపోవడానికి కారణమయ్యాడని..
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మణిపూర్ అల్లర్లపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చేరింది. ప్రధాని మోడీ రావణాసురిడి వల్లే అహంకారంతో మణిపూర్ కాలిపోవడానికి కారణమయ్యాడని.. మణిపూర్‌లో భాతరమాతను హత్య చేశారని, మీరు దేశ ప్రేమికులు కాదు, దేశ ద్రోహులు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అనంతరంస్పందించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని.. రావణాసురుడు అన్నందుకు భారత జాతీ రాహుల్ ను క్షమించదని అన్నారు. అలాగే మణిపూర్ విషయంలో భరతమాతను హత్య చేశారని తీవ్రమైన ఆరోపణలు చేయడం తగదని.. కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి కాదని.. అది పూర్తిగా అవినీతి కూటమని చెప్పుకొచ్చారు.
అలాగే.. ఎన్ని కుట్రలు చేసి అల్లర్లు సృష్టించిన మణిపూర్‌ను భారత్ నుంచి ఎవరు విడదీయ లేరని చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా జమ్మూ, కాశ్మీర్‌లో రిఫరెండమ్ నిర్వహించాలని అంటుందని, భారత మాతను హత్య చేశారని రాహుల్ అంటుంటే.. బల్లలు గుద్దుతున్నారని.. రాహుల్ గాంధీ.. భారతీయుడు కాదని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని స్మృతి ఇరాని ఫైర్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళపై జరుగుతున్న అత్యాచారాలపై ఆమె సభ సాక్షిగా కాంగ్రెస్ పార్టీని నిలదీశారు.
Read More..
Rahul Gandhi : భారతమాతను హత్య చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు