పక్కా ప్లాన్ ప్రకారమే BBC డాక్యుమెంటరీ: కేంద్ర మంత్రి జైశంకర్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ న్యూస్ ఏజెన్సీ బీబీసీ 2002 గుజరాత్ అల్లర్లపై 'ఇండియా: మోదీ క్వశ్చన్' అనే పేరుతో రూపాందించిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Update: 2023-02-21 13:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ న్యూస్ ఏజెన్సీ బీబీసీ 2002 గుజరాత్ అల్లర్లపై 'ఇండియా: మోదీ క్వశ్చన్' అనే పేరుతో రూపాందించిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాని మోడీ ప్రమేయం ఉందని ఈ డాక్యుమెంటరీలో బీబీసీ పేర్కొనడంతో దేశవ్యా్ప్తంగా తీవ్ర దుమారమే చెలరేగింది. తాజాగా బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో బీబీసీ రూపొందించిన 'ఇండియా: మోదీ క్వశ్చన్' డాక్యుమెంటరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. 'ఇండియా: మోదీ క్వశ్చన్' పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ అనుకోకుండా తీసిందని కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ డాక్యుమెంటరీ రూపొందించారని జైశంకర్ ఆరోపించారు. బీబీసీ డాక్యుమెంటరీ తీయాలనుకుంటే ఇండియాలో చాలా అంశాలున్నాయన్నారు. 1984 సిక్కు అల్లర్లు, మాజీ ప్రధాని ఇందిరా మరణంపై ఎందుకు డాక్యుమెంటరీ తీయలేదని ప్రశ్నించారు. భారత్‌లో ఎలక్షన్ సీజన్ ప్రారంభమైందో లేదో తెలీదు కానీ.. లండన్, న్యూయార్క్‌లో మాత్రం కచ్చితంగా ఎలక్షన్ సీజన్ ప్రారంభమైందని పేర్కొన్నారు.  స్వయంగా కేంద్రమంత్రి లండన్, న్యూయార్క్‌ల పేర్లు ప్రస్తావించడంతో.. ప్రధాని మోడీ బీబీసీ డాక్యుమెంటరీ వెనుక ఆ రెండు దేశాల హస్తం ఉందా అనే అనుమానాలు తలెత్తున్నాయి. 

Tags:    

Similar News