ఆధునిక భారత చరిత్రలో ఆ నలుగురి పాత్రే కీలకం: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

గుజరాతీయుల విషయంలో కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-05-19 08:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాతీయుల విషయంలో కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక భారత దేశ చరిత్రలో నలుగురు గుజరాతీయులు కీలక పాత్ర పోషించారని అన్నారు. గుజరాత్ సమాజ్ 125 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అమిత్ షా మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్, ప్రధాని నరేంద్ర మోడీలు ఆధునిక భారత దేశ చరిత్రలో గణనీయమైన కృషి చేశారని అన్నారు. ప్రధాని మోడీ వల్లే భారతదేశ కీర్తి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోందని చెప్పారు.

గాంధీజీ కృషి వల్ల దేశానికి స్వాతంత్ర్యం వస్తే, పటేల్ వల్ల దేశం ఏకమైంది. మొరార్జీ దేశాయ్ వల్ల ప్రజాస్వామ్యం పునరుజ్జీవం పొందిందన్నారు. ఇక నరేంద్ర మోడీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారత దేశం సంబరాలు చేసుకుంటోందని, ఈ నలుగురు గుజరాతీయులు గొప్ప విజయాలు సాధించారని.. వీరు యావత్ జాతికే గర్వకారణం అన్నారు. కాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాతీయులకే ప్రాధాన్యత ఇస్తోందనే విమర్శలు వినిపిస్తున్న వేళ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

Tags:    

Similar News