Maharashtra: శివాజీ పేరు చెప్పుకుంటూ.. ఔరంగజేబ్‌లా ఉద్ధవ్ ఠాక్రే పనులు: మహా సీఎం షిండె

శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

Update: 2024-09-01 18:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర రాజకీయాల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల సింధుదుర్గ్‌లో శివాజీ విగ్రం కూలిన ఘటన చుట్టూ రాష్ట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆదివారం దీనిపై మహా వికాస్ అఘాడి(ఏంవీఏ) నిరసనల నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఆయన ఔరంగజేబ్, అఫ్జల్ గంజ్‌లను అనుసరించేలా ప్రవర్తిస్తున్నారని షిండె విమర్శించారు. 2 ఏళ్ల క్రితమే మహారాష్ట్ర ప్రజలు ఉద్ధవ్ ఠాక్రెను గెంటేశారని, ఆయన శివాజీ పేరుతో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చారు. కానీ ఇతరులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. శివాజీ మహరాజ్ తమకు రాజకీయ విషయం కాదని, ఆయన ఒక గుర్తింపు, విశ్వాసమని అన్నారు. ప్రతిపక్షాలు శివాజీ అంశాన్ని రాజకీయం చేయడం బాధాకరమని తెలిపారు. ఇటీవల జరిగిన సంఘటన దురదృష్టకరం. దానిపై రాజకీయాలు చేయడం విచారకరమని షిండె అన్నారు. షివాజీ అంశాన్ని రాజకీయం చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ గతేడాది డిసెంబర్‌లో సింధుదుర్గ్ జిల్లాలో షివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది గత నెలల్ కూలిపోవడం అతిపెద్ద రాజకీయ అంశంగా మారింది. 

Tags:    

Similar News