కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు

మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి. అధికారం దూరమై తీవ్ర సంకట స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.

Update: 2022-08-17 13:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి. అధికారం దూరమై తీవ్ర సంకట స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్‌లో పెను తుఫాన్ చెలరేగింది. ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. కాంగ్రా ఎమ్మెల్యే పవన్ కాజల్, నలాగఢ్ ఎమ్మెల్యే లఖ్వీందర్ సింగ్ రాణాలు బుధవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం జై రామ్ ఠాకూర్ మాట్లాడుతూ.. వీరి రాక తమ పార్టీకి ఖచ్చితంగా బలం చేకూర్చుతుందని అన్నారు. అయితే బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలిద్దరూ కాంగ్రెస్‌లో కీలకమైన నేతలు కావడం విశేషం. పవన్ కాజల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాగా, లఖ్వీందర్ సింగ్ రాణా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ నుండి కాంగ్రెస్‌లో చేరేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారని హస్తం పార్టీ ప్రకటన చేసిన వెంటనే బీజేపీ రివర్స్ ఎటాక్ ప్రారంభించింది. కాంగ్రెస్ నుండి కీలక నేతలను తమ పార్టీలోకి లంగర్ వేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్‌లో కలవరం స్టార్ట్ అయింది.   


Similar News