Mahakumbhamela : ప్రయాగ్ రాజ్ లో త్రిముఖ గజరాజు హాల్ చల్

ప్రయాగ్ రాజ్(Prayag Raj) మహకుంభమేళా(Mahakumbhamela)లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2025-01-16 06:23 GMT
Mahakumbhamela : ప్రయాగ్ రాజ్ లో త్రిముఖ గజరాజు హాల్ చల్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ప్రయాగ్ రాజ్(Prayag Raj) మహకుంభమేళా(Mahakumbhamela)లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కుంభమేళాలో మూడు తలలు త్రిముఖ గజరాజు ప్రత్యక్షమవడంతో దానితో ఫోటోలు దిగడానికి జనం ఎగబడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ప్రస్తుతం మూడు తలల ఏనుగు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఇండియా టీవీ ఫ్యాక్ట్ చెక్(India TV Fact Check) చేస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోటోలు, వీడియో భారత్ లోనివే కాదని, అవి థాయ్ లాండ్ లోని ఆయుతయ ఖోన్ ఫెస్టివల్-2024 కు సంబంధించినవని వెల్లడించింది. ఏనుగుకు రెండు వైపులా ఉన్న తలలు కూడా నిజమైనవి కాదని, కృత్రిమమైనవి తేల్చింది. 

Tags:    

Similar News