‘యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను చంపేస్తాం’

బీజేపీ అగ్రనేతలకు వరుస బెదిరింపు కాల్స్ రావడం పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది.

Update: 2023-04-25 05:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ అగ్రనేతలకు వరుస బెదిరింపు కాల్స్ రావడం పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. నిన్న ప్రధాని మోడీ కేరళ పర్యటన సందర్భంగా పార్టీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ రాగా, తాజాగా.. యూపీ సీఎం‌ యోగీ ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ హెచ్చరికలు రావడం నాయకులు, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. లక్నోలోని ఓ గుర్తు తెలియని వ్యక్తి 'డయల్ 112' ద్వారా సీఎం యోగీకి బెదిరింపు సందేశం పంపాడు. త్వరలోనే ముఖ్యమంత్రిని యోగీని చంపేస్తానంటూ రాసుకొచ్చాడు. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన 112 ఆపరేషన్ కమాండర్ అధికారులు ఆ గుర్తు తెలియని వ్యక్తిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజల అత్యవసర సేవల కోసం గతంలో యూపీ ప్రభుత్వం ‘డయల్ 112’ నంబర్‌ను ప్రారంభించింది.

Tags:    

Similar News