రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం.. అంబానీకి బెదిరింపు మెయిల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మెన్ ముకేశ్ అంబానీని చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు ఇవాళ పోలీసులు తెలిపారు. తమకు రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ముకేశ్ అంబానీకి మెయిల్ వచ్చిందని వెల్లడించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మెన్ ముకేశ్ అంబానీని చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు ఇవాళ పోలీసులు తెలిపారు. తమకు రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ముకేశ్ అంబానీకి మెయిల్ వచ్చిందని వెల్లడించారు. తమ వద్ద బెస్ట్ షూటర్స్ కూడా ఉన్నట్లు మెయిల్లో హెచ్చరించారని అధికారులు పేర్కొన్నారు. షాదాబాద్ ఖాన్ పేరుతో ఉన్న మెయిల్ నుంచి నిన్న బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలియజేశారు.
కాగా, అంబానీ నివాసానికి చెందిన సెక్యూరిటీ అధికారులు ముంబైలోని గామ్దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఖేష్ అంబానీకి హత్య బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది బిహార్లోని దర్భంగాకు చెందిన వ్యక్తి ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు అరెస్టయ్యాడు.