కాంగ్రెస్ మూర్ఖత్వానికి ఇది ఉదాహరణ: నిర్మలా సీతారామన్

కాంగ్రెస్ పార్టీ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. బజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధించాలని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన వాదనపై ఆమె సీరియస్ అయ్యారు.

Update: 2023-05-10 08:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. బజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధించాలని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన వాదనపై ఆమె సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ మేనిఫెస్టో "మూర్ఖత్వానికి ఉదాహరణ" అని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో భాగంగా బెంగళూరులో ఆమె ఓటు వేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. "మేము ఎల్లప్పుడూ బజరంగ్ బలిని గౌరవిస్తాము, హనుమాన్ చాలీసాను పఠిస్తాము. కానీ కాంగ్రెస్‌కు ఇది ఎన్నికల సమస్య. కర్ణాటక హనుమాన్ జీ జన్మస్థలం." అని ఆమె చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం: డీకే శివకుమార్ 

Tags:    

Similar News