లోక్‌సభ ఫలితాలపై ఏ రాష్ట్రంలోనూ ఉత్కంఠ లేదు. : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఎటువంటి ఉత్కంఠ లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. రిజల్ట్‌పై క్లారిటీతో ఉన్నామని, బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయే కూటమికి 400 కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని దీమా వ్యక్తం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఎటువంటి ఉత్కంఠ లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. రిజల్ట్‌పై క్లారిటీతో ఉన్నామని, బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయే కూటమికి 400 కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని దీమా వ్యక్తం చేశారు. అహ్మాదాబాద్ పర్యటనలో ఉన్న అమిత్ షా సోమవారం ఓ కార్యక్రమంలో భాగంగా ప్రసంగించారు. జనవరిలో 11 రాష్ట్రాల్లో పర్యటించానని, లోక్‌సభ ఫలితాలపై ఏ రాష్ట్రంలోనూ ఉత్కంఠ లేదని తెలిపారు. మోడీ పదేళ్ల పాలనలో తొలి ఐదేళ్లు కాంగ్రెస్ తవ్విన గొయ్యిని పూడ్చడానికే సరిపోయిందని విమర్శించారు. గత పదేళ్లలో ప్రధాని మోడీ అనేక పనులకు దిశానిర్దేశం చేశారని, ఊహకందని లక్ష్యాలను సైతం పూర్తి చేశారని కొనియాడారు. గుజరాత్ మోడలే మోడీని ముందుండి నడిపించిందన్నారు. ఒక ప్రణాళికను రూపొందించిన తర్వాత దానిని అమలు చేయగల సత్తా కేవలం మోడీకి మాత్రమే ఉందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందని, మోడీ మూడోసారి అధఇకారంలోకి వస్తే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపారు. అంతకుముందు అమిత్ షా రూ.1950 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.