వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే మా లక్ష్యం.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

బెంగళూరులో ఇవాళ విపక్షాల మెగా మీట్ జరగనున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-07-17 10:55 GMT

దివ, వెబ్ డెస్క్: బెంగళూరులో ఇవాళ విపక్షాల మెగా మీట్ జరగనున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడించడమే తమ లక్ష్యమని అన్నారు. సోమవారం బెంగళూరులో జరగనున్న విపక్షాల సమావేశానికి వెళ్లే ముందు చెన్నయ్ ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయని అన్నారు. అంతకు ముందు బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన విపక్షాల మొదటి మీటింగ్ లోనే బెంగళూరులో రెండో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఎప్పుడో 13 ఏళ్ల కిందట నమోదైన తప్పుడు కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి నివాసం ఇంటిపై ఈడీ దాడులు చేయడం కక్షపూరిత చర్య అని ఆయన అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో దేశంలోని విపక్ష పార్టీల నాయకులపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. కాగా బెంగళూరులో జరగనున్న విపక్షాల మీటింగ్ లో కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, ఆప్, డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీతో పాటు దాదాపు 24 పార్టీల నాయకులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, కేజ్రీవాల్, మమతాబెనర్జీ, హేమంత్ సోరెన్ తదితరులు హాజరుకానున్నారు. 

Tags:    

Similar News