రాజ్యసభలో ఎన్డీఏకు తగ్గిన బలం..బిల్లుల ఆమోదంపై సందిగ్ధత!

ఇటీవల వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన ఎన్డీఏకు రాజ్యసభలో మెజారిటీ తగ్గింది. రాష్ట్రపతిచే నామినేటె చేసిన ఎంపీలు రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేష్ జెఠ్మలానీల పదవీ కాలం గత శనివారంతో ముగిసింది

Update: 2024-07-15 12:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన ఎన్డీఏకు రాజ్యసభలో మెజారిటీ తగ్గింది. రాష్ట్రపతిచే నామినేటె చేసిన ఎంపీలు రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేష్ జెఠ్మలానీల పదవీ కాలం గత శనివారంతో ముగిసింది. అయితే వీరు నామినేట్ చేయబడినప్పటికీ మోడీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. దీంతో పెద్దల సభలో ఎన్టీయే కూటమి సంఖ్యా బలం పడిపోయింది. లోక్ సభలో 245 సీట్లకు గాను ప్రస్తుతం 20 ఖాళీలున్నాయి. దీంతో సభలో మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంది. అయితే నలుగురు ఎంపీల పదవీ విరమణతో ఎన్డీయే కూటమి సంఖ్యా బలం 101కి చేరింది. మెజారిటీకి మరో 12 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. అయితే త్వరలో లోక్ సభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మెజారిటీ తగ్గడంతో ప్రభుత్వంలో ఆందోళన నెలకొంది. బిల్లుల ఆమోదంపైనా సందిగ్ధత ఏర్పడింది.

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 87 మంది సభ్యులు ఉన్నారు. అందులో కాంగ్రెస్‌కు 26, బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు13, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకేకు చెరో 10 మంది సభ్యులున్నారు. రెండు కూటములలో లేని బీఆర్ఎస్‌కు నలుగురు, అన్నాడీఎంకేకు నలుగురు, ఆంద్రప్రదేశ్‌లోని వైఎస్సార్ సీపీ పార్టీకి 11 మంది సభ్యులున్నారు. దీంతో బిల్లుల ఆమోదంపై ఎన్డీఏతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే వైఎస్సార్ సీపీ గతంలో బీజేపీకి మద్దతిచ్చింది. దీంతో ఈ సీట్లు మోడికి అనుకూలంగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు చెందిన బిజూ జనతాదళ్ కు 9 మంది రాజ్యసభలో ఎంపీలున్నారు. కానీ ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు. దీంతో అప్పటి నుంచి బీజేపీకి బీజేడీ దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో బీజేడీ, వైఎస్సార్ సీపీ మద్దతుపై ఉత్కంఠ నెలకొంది. కాగా, ప్రస్తుతం రాజ్యసభలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఈ ఏడాదే ఎన్నికలు జరిగే చాన్స్ ఉంది. వీటిలో మహారాష్ట్ర, అసోం, బిహార్‌లలో రెండు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. వీటిలో 9 సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఈ సీట్లు గెలిస్తే ఎన్డీఏకు మళ్లీ స్పష్టమైన మెజారిటీ ఉంటుంది. 

Tags:    

Similar News