IMD Rain Alert: కేరళ, మహారాష్ట్ర, గుజరాత్.. రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ

దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి.

Update: 2024-08-03 08:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆగస్టు 4న కొన్ని రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కొంకణ్, గోవా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక సిక్కిం, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్రలోని పుణె, సతారాలో ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్‌లలో అతి భారీ వర్షాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, పాల్ఘర్, థానే, ముంబై, నాసిక్, కొల్హాపూర్‌లలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

ఆగస్ట్ 4న తూర్పు రాజస్థాన్‌లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇప్పటికే భారీ వర్షాలతో అతాలకుతలం అయిన ఉత్తరాఖండ్‌లో మరో రెండు, మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఆగస్టు 6 వరకు వర్షాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కేరళలోని వయనాడ్‌ల , జులై 30న రెండు భారీ కొండచరియలు విరిగి పడి వినాశనాన్ని సృష్టించిన నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో నివసించే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.

Tags:    

Similar News