రోబోటిక్ స్పెర్మ్ ఇంజెక్షన్‌తో.. పండండి బిడ్డలకు జన్మ
ఈ ఘటన రోబో సినిమాను గుర్తు చేస్తోంది. ఆ సినిమాలో రోబో ఒకామెకు సిజేరియన్ ఆపరేషన్ కాకుండా నార్మల్ డెలివరీ చేస్తుంది.
న్యూఢిల్లీ: ఈ ఘటన రోబో సినిమాను గుర్తు చేస్తోంది. ఆ సినిమాలో రోబో ఒకామెకు సిజేరియన్ ఆపరేషన్ కాకుండా నార్మల్ డెలివరీ చేస్తుంది. నిజ జీవితంలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. రోబోటిక్ స్పెర్మ్ ఇంజెక్షన్‌తో గర్భం దాల్చిన ఇద్దరు శిశువులు పుట్టారు. ఇది టెక్నాలజీలో సంచలనాత్మక అభివృద్ధి అనే చెప్పాలి. ఎంఐటీ (మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) రివ్యూ ప్రకారం బార్సిలోనాకు (స్పెయిన్) చెందిన డాక్టర్ల బృందం న్యూయార్క్‌లోని న్యూ హోప్ ఫెర్టిలిటీ సెంటర్‌లో అండంలోకి స్పెర్మ్ కణాలను చొప్పించడానికి రోబోటిక్ సూదిని ఉపయోగించారు. ఫలితంగా రెండు ఆరోగ్యకరమైన పిండాలు తయారయ్యాయి.
చివరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఓ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని తొలి ఇన్సెమినేషన్ రోబోట్‌పై పనిచేస్తున్న ఇంజనీర్లలో ఒకరికి ఫెర్టిలిటీ మెడిసిన్ రంగంలో అంతగా అనుభవం లేదు. ‘ఫెర్టిలిటీ మెడిసిన్‌లో అస్సలు అనుభవం లేని డాక్టర్ రోబోటిక్ సూదిని సరైన స్థానంలో ఉంచేందుకు సోనీ ప్లేస్టేషన్ 5 కంట్రోలర్‌ను ఉపయోగించారు. కెమెరా ద్వారా మానవ అండాన్ని చూసి తనంతట తానే ముందుకు సాగి అండంలోకి చొచ్చుకొనిపోయి ఒక స్పెర్మ్ సెల్‌ను జారవిడిచింది’ అని ఆ నివేదిక పేర్కొంది. ఫలితంగా ఆరోగ్యకరమైన పిండాలు ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చాయి. రోబో ద్వారా ఫలదీకరణం చెంది జన్మించిన తొలి శిశువులు వీరే అని ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ పేర్కొంది.