లవ్ బ్రేకప్ అయిన వారికే ఉద్యోగం.. కంపెనీ వినూత్న ఆఫర్
చాలామంది ఉద్యోగం(Job) సాధించాలనే తపనతో ఉంటారు.

దిశ,వెబ్‌డెస్క్: చాలామంది ఉద్యోగం(Job) సాధించాలనే తపనతో ఉంటారు. దీని కోసం వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుని కష్టపడి శిక్షణ పూర్తి చేసుకుంటారు. ఈ క్రమంలోనే స్కిల్స్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ప్రత్యేక శిక్షణ(Special training) తరగతులకు అటెండ్ అవుతుంటారు. ఈ తరుణంలో ఉద్యోగ ఆఫర్లు ఎక్కడ ఉన్నాయో సెర్చ్ చేయడం ప్రారంభిస్తారు. అయితే ఏదైనా ఉద్యోగం సాధించాలంటే మొదటగా ఎగ్జామ్స్, తర్వాత ఇంటర్వ్యూ వంటివి కండెక్ట్ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో క్వాలిఫికేషన్స్, స్కిల్స్, అనుభవం వంటివి కూడా చూస్తారు.
కానీ బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం వినూత్నమైన పద్దితిలో ఉద్యోగ ఆఫర్స్ ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు భిన్నమైన రూల్స్ కూడా పెట్టింది. అయితే ఈ ఉద్యోగాలకు విద్యార్హత తో సంబంధం లేకుండా లవ్ బ్రేకప్ అయిన వారికే ఉద్యోగం ఇస్తామంటూ వినూత్న కండిషన్స్ పెట్టినట్లు ప్రకటించింది. ఇంతకు ఆ ఉద్యోగం ఏంటీ? ప్రేమలో బ్రేకప్ కు ఉద్యోగానికి సంబంధం ఏమిటి? అనే సందేహం మీలో వచ్చే ఉంటుంది కదా! అయితే ఇది చదవాల్సిందే..
వివరాలు ఇలా.. బెంగళూరు(Bengaluru)కు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ (mentoring and consulting firm) చీఫ్ డేటింగ్ ఆఫీసర్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. లవ్, ఆన్ లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ ఉద్యోగానికి అర్హతల విషయానికి వెళితే.. ఉద్యోగానికి వచ్చేవారికి కొన్ని నిబంధనలు పెట్టింది. ఈ జాబ్ కావాలనుకునే వారికి 3 డేట్స్, 2 సిట్యుయేషన్‌షిప్‌లు, ఒక లవ్ బ్రేకప్ జరిగి ఉండాలి.
ఆధారాలు అడగం కానీ మీ స్టోరీలు వింటాం అని తెలిపింది. 2-3 డేటింగ్ యాప్స్ వాడి ఉండాలి. డేటింగ్ టర్మ్స్ తెలియాలి అని పేర్కొంది. ఇలాంటి వారు ఉద్యోగానికి అర్హులు అని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఇందులో ఎక్స్‌పిరియన్స్ ఉండాలి.. కానీ క్యాట్ ఫిషింగ్‌కు తావులేదని స్పష్టం చేసింది. అయితే ఆ కంపెనీ జీతం గురించి ఎలాంటి వివరాలు తెలుపలేదు. మెంటరింగ్&కన్సల్టింగ్ సంస్థ Topmate చీఫ్ డేటింగ్ ఆఫీసర్ పోస్టు కోసం చేసిన ఈ ప్రకటన వైరలవుతోంది.