గవర్నర్ మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని రాష్ట్రపతికి సీఎం లేఖ
మిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి "మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని.. సీఎం ఎం కె స్టాలిన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు లేఖ రాశారు. ఆ లేఖలోనే గవర్నర్ అనుసరిస్తున్న తీరు.. రాష్ట్ర శాంతికి "ముప్పు" అని పేర్కొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి "మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని.. సీఎం ఎం కె స్టాలిన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు లేఖ రాశారు. ఆ లేఖలోనే గవర్నర్ అనుసరిస్తున్న తీరు.. రాష్ట్ర శాంతికి "ముప్పు" అని పేర్కొన్నారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలోని మాజీ మంత్రులను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతిని ఆలస్యం చేశారని, అయితే జైల్లో ఉన్న మంత్రి వి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి తొలగించారన్నారు. ఈ పద్ధతి గవర్నర్ రాజకీయ పార్టీకి మద్దతుగా నిలవడమే అని సీఎం స్టాలిన్ అన్నారు. తమిళనాడు గవర్నర్ పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన లేఖ ద్వారా రాష్ట్రపతి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.