జూన్ 1 నుంచి కొత్త రూల్.. ‘‘దగ్గు’’ సిరప్‌లపై కేంద్రం కీలక నిర్ణయం!

భారత్‌లో తయారైన దగ్గు మందుల నాణ్యతపై అంతర్జాతీయ మార్కెట్‌లో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-05-23 07:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో తయారైన దగ్గు మందుల నాణ్యతపై అంతర్జాతీయ మార్కెట్‌లో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దగ్గు సిరప్‌లకు ప్రభుత్వ ల్యాబ్‌ల్లో అనుమతి తప్పనిసరి చేసింది. ఇకపై ప్రభుత్వ ల్యాబ్‌ల్లో తనిఖీ తర్వాతే ఎగుమతులకు అనుమతులు ఇస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) సోమవారం ఒక నోటిఫికేన్‌లో తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లలో తనిఖీలు తప్పనిసరి అని పేర్కొంది. ఎగుమతులపై ఈ కొత్త నిబంధనలు జూన్ 1 నుంచి వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేశారు. కాగా గతేడాది గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లో 84 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ మరణాలకు భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్‌లే కారణం అనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఔషధ ఎగుమతులపై మరింత కఠినంగా వ్యవహరించాలనే నిబంధన తీసుకువస్తోంది.

Tags:    

Similar News