దేశం నుంచి తరిమి కొడదాం.. INDIA కూటమి 5 డిమాండ్లు ఇవే!

ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ లాంటి వ్యవస్థలను బీజేపీ ఉపయోగించి ప్రతిపక్ష నేతలను భయపెడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు.

Update: 2024-03-31 10:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ లాంటి వ్యవస్థలను బీజేపీ ఉపయోగించి ప్రతిపక్ష నేతలను భయపెడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌కు మద్దతుగా డిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి నేతల ర్యాలీ నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్‌, ఎన్సీపీ, ఎస్పీ, టీఎంసీ, ఆప్‌ సహా సుమారు 28 పార్టీల సీనియర్‌ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలను మోడీ నాశనం చేశారని మండిపడ్డారు. ఈ దేశాన్ని రక్షించాలని మనమంత ఒకటయ్యామన్నారు. ప్రజాస్వామ్యం కావాలో లేక నియంతృత్వం కావలో మీరే తేల్చుకోవాలన్నారు. నియంతృత్వాన్ని సమర్థించే వారిని దేశం నుంచి తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు విషం లాంటివని అని మండిపడ్డారు.

ఇండియా కూటమి 5 డిమాండ్లు

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. ఇండియా కూటమికి 5 డిమాండ్లు ఉన్నాయన్నారు. ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల్లో సమాన అవకాశం కల్పించాలన్నారు. ఈసీఐ వారిపై బలవంతపు చర్యలను నిలిపి వేయాలన్నారు. వ్యతిరేకత తీసుకున్నది ఈడీ, సీబీఐ, ఐటీ, హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌లను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రతిపక్షాలను ఆర్థికంగా బలహీనపరిచే ప్రయత్నాలను ఆపాలని, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ సేకరించిన నిధులపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ ఢిల్లీ సీఎం, జార్ఖండ్ సీఎంల‌తో పాటు వివిధ రాష్ట్రాల‌కు చెందిన విప‌క్ష నేత‌ల‌ను జైలుపాలు చేస్తోంద‌ని ఎస్‌సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం త‌న చ‌ర్య‌ల‌తో ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాల‌రాస్తూ రాజ్యాంగ వ్య‌వ‌స్ధ‌ల‌పై దాడికి తెగ‌బ‌డుతోంద‌ని ఫైర్ అయ్యారు. ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవ‌డం మ‌న బాధ్య‌త‌ని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News