Thackeray: మహారాష్ట్ర ప్రయోజనాల కోసం కలవడానికి సిద్ధం.. ఉద్ధవ్, రాజ్ థాక్రే‌ల హింట్!

మహారాష్ట్రలో ఉద్థవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రేలు మరోసారి ఏకం కానున్నట్టు తెలుస్తోంది.

Update: 2025-04-19 14:55 GMT
Thackeray: మహారాష్ట్ర ప్రయోజనాల కోసం కలవడానికి సిద్ధం.. ఉద్ధవ్, రాజ్ థాక్రే‌ల హింట్!
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్థవ్ థాక్రే (Udhav Thackrey), మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే (Raj thackrey) లు మరోసారి ఏకం కానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇరువురు నేతలు శనివారం హింట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి, మరాఠీ భాషను కాపాడేందుకు వివాదాలను పక్కన బెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాజ్ థాక్రే అన్నారు. చిత్రనిర్మాత మహేష్ మంజ్రేకర్‌తో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్ చేశారు. ‘మహారాష్ట్రలో ప్రధాన సమస్యలు తలెత్తినప్పుడు, మా మధ్య నెలకొన్ని వివాదాలు. తగాదాలు చాలా చిన్నవి. మహారాష్ట్ర, మరాఠీ ప్రజల కోసం కలిసి రావడం కష్టమైన పని కాదు. కానీ అలా చేయడానికి ఇష్టపడటమే అసలైన ప్రాబ్లం’ అని తెలిపారు. మరాఠా ప్రజలు కలిసి ఒక పార్టీని సైతం ఏర్పాటు చేయాలని తాను భావిస్తున్నట్టు తెలిపారు.

రాజ్ థాక్రే వ్యాఖ్యలపై ఉద్ధవ్ థాక్రే సైతం స్పందించారు. మరాఠీ సమాజ ప్రయోజనాల నిమిత్తం ఐక్యంగా ఉండటానికి తానుకూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే, మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఇంటికి ఆహ్వానించి భోజనం వడ్డించకూడదని తెలిపారు. ఇలా జరగనప్పుడే రాష్ట్ర సంక్షేమం కోసం ఆలోచిస్తానని తెలిపారు. హిందీ భాషను మూడో భాషగా బోధించాలని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని ఇరువురు నేతలు వ్యతిరేకించడంతో పాటు పై వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందీ భాషా వివాదం వీరిద్దరిని ఏకం చేయనుందని పలువురు భావిస్తున్నారు.

కాగా, శివసేనలో ఉద్ధవ్‌ థాక్రేను తన వారసుడిగా ప్రకటించిన తర్వాత రాజ్ థాక్రు 2005 నవంబర్ 27న పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన మహారాష్ట్ర నవ నిర్మాణ సేనని స్థాపించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News