ఉప ఎన్నికలో ఓటు వేయకుండా ఓ వర్గంపై దాడి.. గాయాలతోనే ఓటు వేసిన బాధితులు

దేశంలో ఇవ్వాళ 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది.

Update: 2024-07-10 07:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఇవ్వాళ 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ఉత్తరాఖండ్ లోని మంగళూరు అసెంబ్లీ స్థానం కూడా ఒకటి. అయితే ఈ నియోజకవర్గ పరిధిలోని లిబ్బర్హేరి గ్రామంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం 7 గంటల నుండి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోండగా.. ఓటు వేయడానికి వెళ్లిన ఓ వర్గం వారిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. మార్గమధ్యంలో ఆపి కర్రలతో వారిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. దీనిపై బాదితులు మాట్లాడుతూ దాడి చేసింది బీజేపీ మూకలు అని ఆరోపిస్తున్నారు. ఓటు వేయకుండా నిరోదించేందుకే ఈ పని చేశారని అంటున్నారు. వారి ఒంటి నిండా రక్తం కారుతున్న లెక్కచేయకుండా బాధితులు గాయాలతోనే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. అనంతరం దాడిలో గాయపడిన వారిని స్థానిక కాంగ్రెస్ నాయకుడు క్వాజీ నిజాముద్దీన్ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గాయాలతోనే ఓటు హక్కును వినియోగించుకున్న వారి నిబద్దతను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Tags:    

Similar News