IVF: నా స్పెర్మ్ వాడుకుంటే ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ ఫ్రీ
సంతానలేమితో బాధపడుతున్న మహిళలు, దంపతులకు సహాయం చేయాలని అనుకుంటున్నానని, తన స్పెర్మ్(Sperm Donation) వాడుకుంటే మహిళకు ఉచితంగా ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చికిత్స అందిస్తామని టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్(Telegram CEO Pavel Durov) ప్రకటించారు.
దిశ, నేషనల్ బ్యూరో: సంతానలేమితో బాధపడుతున్న మహిళలు, దంపతులకు సహాయం చేయాలని అనుకుంటున్నానని, తన స్పెర్మ్(Sperm Donation) వాడుకుంటే మహిళకు ఉచితంగా ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చికిత్స అందిస్తామని టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్(Telegram CEO Pavel Durov) ప్రకటించారు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ పావెల్ దురోవ్ స్పెర్మ్ ఉపయోగించుకుంటే తమ క్లినిక్‌లో ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స(Free IVF Treatment) అందిస్తామని పావెల్ భాగస్వామ్యంలో ఉన్న అల్ట్రావిటా ఫెర్టిలిటీ క్లినిక్ పేర్కొంది. 37 ఏళ్లలోపు వయసున్న ఆరోగ్యవంతులైన మహిళలు ముందుగా షెడ్యూల్ చేసుకుని తమ క్లినిక్ వస్తే సెలెక్షన్ ఉంటుందని వివరించింది. టెలిగ్రామ్ సీఈవో పావెల్ ఇటీవలే టెలిగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. గత 15 ఏళ్లకాలంలో 12 దేశాల్లో తనకు సుమారు 100 మంది బయలాజికల్ పిల్లలు ఉన్నారని వివరించారు. తన మిత్రుడు, ఆయన భార్య తొలిసారిగా తనను స్పెర్మ్ డొనేట్ చేయాలని అడిగినప్పుడు నవ్వి ఊరుకున్నారని, కానీ, ఆ తర్వాత వారి సీరియస్‌నెస్ చూసి అంగీకరించానని తెలిపారు. ఆ తర్వాత చాలా మంది వీర్యదానం చేశానని వివరించారు. ఆరోగ్యవంతమైన స్పెర్మ్ తగ్గిపోతున్నదని, ఈ సమస్యను ఎదుర్కోవడంలో తనవంతు పాత్ర పోషించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. తాను ఓపెన్ సోర్స్ డీఎన్‌ఏ ఏర్పాటు చేసే ఆలోచనల్లోఉన్నారని, తద్వార భవిష్యత్‌లో తన బయలాజికల్ పిల్లలు సులువుగా వారిని గుర్తపట్టుకోగలరని వివరించారు.