Pawan K Varma: సీఎంకు ఎదురు దెబ్బ.. మాజీ ఎంపీ రాజీనామా..
TCM Leader Pawan K Varma tenders resignation from party| బెంగాల్ సీఎం మమత బెనర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్దిరోజులకే రాజ్యసభ మాజీ ఎంపీ పవన్ వర్మ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జనతాదళ్ (యునైటెడ్) నుంచి గత ఏడాది
దిశ, వెబ్‌డెస్క్: TCM Leader Pawan K Varma tenders resignation from party| బెంగాల్ సీఎం మమత బెనర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్దిరోజులకే రాజ్యసభ మాజీ ఎంపీ పవన్ వర్మ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జనతాదళ్ (యునైటెడ్) నుంచి గత ఏడాది నవంబర్‌లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన 10 నెలలకే తను పార్టీ నుండి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించారు. ప్రియమైన మమత బెనర్జీ జీ, దయచేసి తృణమూల్ కాంగ్రెస్‌కు నా రాజీనామాను ఆమోదించండి. మీ అభిమానానికి, మర్యాదలకు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అంటూ పేర్కొన్నారు. అయితే పార్టీ క్రమశిక్షణ పాటించడం లేదని ఆరోపిస్తూ.. జనతాదళ్ అప్పటి జాతీయ డిప్యూటీ ఛైర్మన్ ప్రశాంత్ కిషోర్‌తో పాటు వర్మను జనవరి 2020లో బహిష్కరించింది. పవన్ వర్మ దేశాలకు భారత రాయబారిగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతినిధిగా పనిచేశారు.
ఇది కూడా చదవండి: ప్రధాని కావాలని ఆశ లేదు.. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి