హింసాత్మక పవిత్రయుద్ధం టార్గెట్.. ముగ్గురు అరెస్ట్

దేశంలో అలజడులు సృష్టించేందుకు హింసాత్మక పవిత్ర యుద్ధం కోసం ప్రయత్నించిన ఓ ఉగ్రవాద మాడ్యూల్ ను ఎన్ఐఏ ఛేదించింది.

Update: 2023-05-27 15:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అలజడులు సృష్టించేందుకు హింసాత్మక పవిత్ర యుద్ధం కోసం ప్రయత్నించిన ఓ ఉగ్రవాద మాడ్యూల్ ను ఎన్ఐఏ ఛేదించింది. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, జాతీయ దర్యాప్త సంస్థ(ఎన్ఐఏ) జబల్పూర్‌లో నిర్వహించిన దాడుల్లో ఈ మేరకు పోలీసులకు కీలక సమాచారం తెలిసింది. పట్టుబడిన వారికి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జబల్పూర్‌లోని ఓమ్టి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 చోట్ల శుక్ర - శనివారాల మధ్య నిర్వహించిన దాడుల్లో ఐసిస్ సానుభూతి పరులు సయ్యద్ మమూర్ అలీ, మహమ్మద్ అదిల్ ఖాన్, మహమ్మద్ షాహిద్‌లను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి పదునైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డిజిటల్ డివైసెస్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదిల్, అతని అనుచరులు సోషల్ మీడియా ద్వారా ఐసిస్ సంస్థ ప్రచారాన్ని వ్యాపింపజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Tags:    

Similar News