Taliban: కాప్ 29 సదస్సుకు తాలిబన్లు.. పాలన చేపట్టాక తొలిసారి హాజరు

అజర్ బైజాన్ రాజధాని బాకులో నిర్వహించే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సుకు ఆప్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్లు హాజరుకానున్నారు.

Update: 2024-11-10 15:09 GMT
Taliban: కాప్ 29 సదస్సుకు తాలిబన్లు.. పాలన చేపట్టాక తొలిసారి హాజరు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల ఫ్రేమ్ కన్వెన్షన్ (UNFCCC) ఆధ్వర్యంలో అజర్ బైజాన్ రాజధాని బాకు నగరంలో సోమవారం నుంచి నిర్వహించే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(Cop-29) సదస్సుకు ఆప్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్లు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. కాప్ సదస్సులో పాల్గొనేందుకు తమ దేశానికి చెందిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారులు ఇప్పటికే అజర్‌బైజాన్ చేరుకున్నారని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ కహర్ బాల్కీ వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత ఐక్యరాజ్యసమితి వాతావరణ చర్చల్లో ఆఫ్ఘనిస్థాన్ పాల్గొననుండం ఇదే తొలిసారి. వాతావరణ మార్పులకు అత్యంత హాని కలిగించే దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ ఆరో స్థానంలో ఉంది. దీంతో తాలిబాన్ ప్రతినిధులు సైతం కాప్ సమ్మిట్‌లలో పాల్గొనాలని పలువురు అభ్యర్థించారు. ఈ క్రమంలోనే వారు అంగీకరించి తమ ప్రతినిధి బృందాన్ని అజర్ బైజాన్‌కు పంపించారు. అయితే తాలిబన్లను ఆప్ఘనిస్థాన్ చట్టబద్దమైన ప్రభుత్వంగా యూఎన్‌ఓ అధికారికంగా గుర్తించనందున ఆఫ్ఘన్ ప్రతినిధి బృందం ఏ హోదాలో సదస్సులో పాల్గొంటుందో స్పష్టంగా వెల్లడించలేదు.

Tags:    

Similar News