కాంగ్రెస్‌కు షాక్.. ‘వీరభద్ర కాంగ్రెస్’ ఏర్పాటుకు విక్రమాదిత్య సింగ్ రెడీ ?
హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి పదవికి విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేశారు. విక్రమాదిత్య సింగ్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ బయో నుంచి 'హిమాచల్ ప్రదేశ్ మంత్రి'ని తొలగించి.. దాని స్థానంలో 'హిమాచల్ కా సేవక్' అని మార్చారు.
దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి పదవికి విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేశారు. విక్రమాదిత్య సింగ్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ బయో నుంచి 'హిమాచల్ ప్రదేశ్ మంత్రి'ని తొలగించి.. దాని స్థానంలో 'హిమాచల్ కా సేవక్' అని మార్చారు. దీంతో పార్టీ పెట్టనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. విక్రమాదిత్య సింగ్ తన తండ్రి, హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పేరు మీద 'వీరభద్ర కాంగ్రెస్' అనే కొత్త పార్టీని స్థాపించే అవకాశం కన్పిస్తుంది. మరోవైపు విక్రమాదిత్య బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.
రాజ్యసభ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ తర్వాత సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం సంక్షోభంలో పడింది. కాగా ఈ నష్టాన్ని పూరించేందుకు సుఖ్విందర్ సింగ్ తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు నందలాల్, భవానీ సింగ్ పటానియాలకు క్యాబినేట్ ర్యాంక్ లు ఇచ్చారు. మరోవైపు 16 మంది లాయర్లను అదనపు అడ్వొకేట్ జనరల్ గా, డిప్యూటీ అడ్వొకేట్ జనరల్ గా నియమించారు. దీనిపై డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్నిహోత్రి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ను కలిసి చర్చించారు.
ప్రతిభా సింగ్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే నంద్ లాల్ కు క్యాబినేట్ ర్యాంకు ఇవ్వడం.. ఆమె కుమారుడు, మాజీ మంత్రి విక్రమాదిత్య సింగ్ ను శాంతింపజేసేందుకే అని తెలుస్తోంది. ఈ చర్యతో ఇతర ఎమ్మెల్యేలు ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉంది.