Sukhbir Badal : భారీ భద్రత నడుమ అంట్లుతోమిన మాజీ డిప్యూటీ సీఎం

దిశ, నేషనల్ బ్యూరో : సిక్కుల అత్యున్నత సంస్థ ‘అకల్ తఖ్త్’(Akal Takht) విధించిన శిక్షను పంజాబ్(Punjab) మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్(Sukhbir Badal) గురువారం రోజు కూడా పాటించారు.

Update: 2024-12-05 10:10 GMT
Sukhbir Badal : భారీ భద్రత నడుమ అంట్లుతోమిన మాజీ డిప్యూటీ సీఎం
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో : సిక్కుల అత్యున్నత సంస్థ ‘అకల్ తఖ్త్’(Akal Takht) విధించిన శిక్షను పంజాబ్(Punjab) మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్(Sukhbir Badal) గురువారం రోజు కూడా పాటించారు. ఇందులో భాగంగా రూప్ నగర్ జిల్లాలోని తఖ్త్ కేస్ ఘర్ సాహిబ్‌‌లో సేవాదార్‌గా ఆయన విధులు నిర్వర్తించారు. బ్లూ కలర్‌లో ఉండే సేవాదార్ యూనిఫామ్‌ను ధరించి తొలుత గంటపాటు గురుద్వారాకు సెక్యూరిటీ గార్డుగా సుఖ్బీర్ సేవలు అందించారు. అనంతరం అక్కడున్న సిబ్బందితో కలిసి గురుద్వారాలోని వంటశాలలో అంట్లు తోమారు. ఆహారం తయారు చేసిన గిన్నెలను శుభ్రం చేశారు. వీల్ ఛైర్‌ పైనుంచే ఈ డ్యూటీలన్నీ ఆయన నిర్వర్తించారు.

బుధవారం రోజు సుఖ్బీర్ సింగ్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు పోలీసులు భద్రతను మరింత పెంచారు. ప్రస్తుతం సుఖ్బీర్‌కు జెడ్ కేటగిరీ భద్రత ఉంది. 2007 నుంచి 2017 మధ్యకాలంలో పంజాబ్‌ రాష్ట్రాన్ని శిరోమణి అకాలీదళ్ పార్టీ పాలించింది. అప్పట్లో అకాలీదళ్ ప్రభుత్వం తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాల కారణంగా సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ అంశంపై విచారణ జరిపిన ‘అకల్ తఖ్త్’ సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆయన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సహా మరొక వ్యక్తిని ఈ ఏడాది ఆగస్టులోనే దోషులుగా తేల్చింది. ఇటీవలే వారికి శిక్షలను ప్రకటించింది.

Tags:    

Similar News