Paramilitary Forces : 730 మంది సీఏపీఎఫ్ సిబ్బంది ఆత్మహత్య.. 55వేల మంది వాలంటరీ రిటైర్మెంట్స్
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) పనిచేస్తున్న సిబ్బందిపై తీవ్రమైన పని ఒత్తిడి ఉంటోంది.
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) పనిచేస్తున్న సిబ్బందిపై తీవ్రమైన పని ఒత్తిడి ఉంటోంది. పనిగంటలు ఎక్కువగా ఉండటంతో వారు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. కంటినిండా నిద్రలేక సీఏపీఎఫ్ బలగాల్లో పలువురిని ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈనేపథ్యంలో కొందరు సీఏపీఎఫ్ సిబ్బంది సూసైడ్స్(Suicide Deaths) చేసుకుంటున్నారు. ఉద్యోగ విరమణ గడువు రాకముందే.. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. తాజాగా రాజ్యసభ(Rajya Sabha)కు కేంద్ర హోంశాఖ(Home Ministry) అందించిన లిఖిత పూర్వక సమాధానంలో సీఏపీఎఫ్(Paramilitary Forces) సిబ్బంది దుస్థితిని అద్దం పట్టే గణాంకాలు ఉన్నాయి. వాటి ప్రకారం.. 730 మంది సీఏపీఎఫ్ జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు. 55వేల మందికిపైగా సిబ్బంది వాలంటరీ రిటైర్మెంట్స్ తీసుకున్నారు.
వ్యక్తిగత కారణాలే ఎక్కువ..
వీరిలో చాలామంది సూసైడ్‌ల వెనుక వ్యక్తిగత కారణాలే ఉన్నాయని వెల్లడించారు. జీవిత భాగస్వామి మరణం, కుటుంబ సభ్యుల మరణం, విడాకులు, ఆర్థిక సమస్యలు, పిల్లలను సరిగ్గా చదివించలేకపోతున్నామనే మనస్థాపం వంటి కారణాల వల్ల సీఏపీఎఫ్ జవాన్లు సూసైడ్ చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న సీఏపీఎఫ్ సిబ్బందిలో 80 శాతం మందికిపైగా సెలవుల కోసం ఇళ్లకు వెళ్లి, డ్యూటీలకు తిరిగొచ్చాక బలవన్మరణాలకు పాల్పడటం విషాదకరం. ఈనేపథ్యంలో సీఏపీఎఫ్ సిబ్బంది వారి కుటుంబీకులతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడిపేలా చేసేందుకు అనుగుణంగా మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని రాజ్యసభకు కేంద్ర హోంశాఖ తెలిపింది. కేంద్ర హోంశాఖ టాస్క్‌ఫోర్స్ కొత్తగా తెచ్చిన లీవ్ పాలసీని 42,797 మందికిపైగా జవాన్లు వాడుకున్నారని పేర్కొంది. ఈ ఏడాది అక్టోబరు వరకు 6,302 మంది సిబ్బంది తమ కుటుంబాలతో 100 రోజులు గడిపారని తెలిపారు.