Suicide: కోటాలో ఆగని మరణాలు.. మరో నీట్ విద్యార్థి సూసైడ్
కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటా నగరంలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ, నేషనల్ బ్యూరో: కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటా (Kota) నగరంలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ (Neet) పరీక్షకు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ తన గదిలోనే సూసైడ్‌కు పాల్పడ్డాడు. బిహార్‌లోని నలంద (Nalanda) జిల్లాకు చెందిన హర్షరాజ్ శంకర్ (17) అనే విద్యార్థి గతేడాది ఏప్రిల్ నుంచి కోటాలోని జవహర్‌నగర్ ప్రాంతంలో ఓ హాస్టల్‌లో ఉంటూ నీట్ ఎగ్జామ్‌కు సన్నద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి తన గదిలోకి వెళ్లిన వెళ్లిన హర్షరాజ్ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగుల కొట్టి చూడగా ఉరేసుకుని కనిపించాడు. హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో వాటిని నియంత్రించడానికి అక్కడి హాస్టల్ యజమానులు సీలింగ్ ఫ్యాన్లకు ఓ పరికరాన్ని అమర్చారు. కానీ హర్షరాజ్ జిమ్ రాడ్ ఉపయోగించి ఉరేసుకోవడం గమనార్హం.
దీంతో ఈ ఏడాది కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 9కి చేరింది. గతంలో కేవలం జనవరి నెలలోనే ఆరుగురు నీట్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. గతేడాది మొత్తం 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, నీట్, జేఈఈ పరీక్షల కోసం కోటాకు వచ్చే విద్యార్థుల్లో మానసిన ఒత్తిడి పెరుగుతుండటం వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆత్మహత్యలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.