Chirag Paswan: మహిళా సీఎం ఉన్న రాష్ట్రంలోనే ఇలాంటి ఘటన జరగడం ఆశ్చర్యం

ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

Update: 2024-08-15 18:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగ ఈ దారుణంపై ఆగ్రహాలు చెలరేగుతున్నా సరే బెంగాల్ సీఎం మౌనంగా ఉన్నారని, ఓ మహిళా ముఖ్యమంత్రి ఉన్నచోటే ఇలాంటి ఘటన జరగడం ఆశ్చర్యంగా ఉంది. 'ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రభుత్వ పాలనలోనైనా ఇలాంటి సంఘటనలను అంగీకరించలేం. ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అంశాలను రాజకీయం చేయడం తనకు బాధిస్తోంది. బుధవారం రాత్రి వేలాది మంది దుండగులు ఆసుపత్రిలోని స్థలాన్ని ద్వంసం చేయడం సాక్ష్యాలను నాశనం చేయడమా? ఎవరినైనా ఇరికించడమా? అనే సందేహం కలుగుతోందని ' పాశ్వాన్ అన్నారు. మహిలా సీఎం ఉన్నచోట ఇలా జరగడం, ఆమె మహిళా ఎంపీలంతా మౌనంగా ఉండటం ఆశ్చర్యం. ఈ ఘటన గర్హనీయం, సిగ్గుచేటు. ఇది మహిళల భద్రతకు సంబంధించిన అంశం. దీనిపై దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. 

Tags:    

Similar News