Student suicide: కోటాలో మరో విద్యార్థి సూసైడ్.. ఈ ఏడాది 16వ ఘటన
రాజస్థాన్‌లోని కోటా నగరంలో మరో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ (Rajasthan)లోని కోటా నగరం(Kota city)లో మరో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తను నివాసం ఉంటున్న హాస్టల్ ఆరో అంతస్తు నుంచి దూకి సూసైడ్‌కు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) అనుప్పూర్‌కు చెందిన వివేక్ కుమార్ (18) ఈ ఏడాది ఏప్రిల్‌లో కోటాకు వచ్చాడు. అక్కడి ఓ ప్రయివేట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. జవహార్‌నగర్ (Jawahar nagar) ప్రాంతంలోని హాస్టల్‌లో ఉంటూ జేఈఈకి ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం అర్థరాత్రి తన హాస్టల్‌లోని ఆరో అంతస్తు నుంచి కిందకు దూకాడు. అనంతరం తీవ్ర గాయాలైన వివేక్‌ను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థి మృతికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. అయితే చదువుల ఒత్తిడి కారణంగానే స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పలువురు భావిస్తున్నారు. కాగా, ఈ ఏడాది కోటాలో సూసైడ్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య 16కు చేరుకుంది. గతేడాది 26 మంది ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.