గొప్ప మనసు చాటుకున్న అగ్ర హీరో.. వయనాడ్ బాధితులకు రూ.3 కోట్ల సాయం

కేరళలోని వయనాడ్ ప్రాంత ప్రజలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడడంతో సుమారు 330 మందికి పైగా మృత్యువాత పడ్డారు.

Update: 2024-08-03 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని వయనాడ్ ప్రాంత ప్రజలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడడంతో సుమారు 330 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది గాయ పడ్డారు. ఇంకా శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా అనేకమంది స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొందరు స్వయంగా రంగంలోకి దిగి సహాచక చర్యల్లో పాల్గొంటున్నారు. తాజాగా సౌతిండియా కథానాయకుడు మోహన్ లాల్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అంతేకాదు.. బాధితుల సంక్షేమం కోసం రూ.3 కోట్ల ఆర్థికసాయం చేశారు. ఇప్పటికే తమిళ నటులు సూర్య, జ్యోతిక జంట రూ.50 లక్షలు, మమ్ముట్టి-దుల్కర్ రూ.40 లక్షలు, కమల్ హాసన్ రూ.25 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.



 


Tags:    

Similar News