పెళ్లి పీటలెక్కనున్న స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. వరుడెవరో తెలుసా ?
స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu) త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ వెంకటదత్త సాయితో పీవీ సింధు పెళ్లి నిశ్చయమైంది.
దిశ, వెబ్ డెస్క్: స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu) త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ వెంకటదత్త సాయితో పీవీ సింధు పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయనాన్ని ఆమె తండ్రి పీవీ రమణ (PV Ramana) వెల్లడించారు. ఇరు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా సాన్నిహిత్యం ఉన్నట్లు తెలిపారు. వీరి వివాహం డిసెంబర్ 22న రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ లో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో గ్రాండ్ గా జరుగనుంది. డిసెంబర్ 20వ తేదీ నుంచి పెళ్లి పనులు ప్రారంభమవుతాయి.
గత నెలలోనే వీరిద్దరి పెళ్లి టాపిక్ రాగా.. ఈ నెలలోనే పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నామని చెప్పారు పీవీ రమణ. జనవరి నుంచి సింధు షెడ్యూల్ బిజీగా ఉండటంతో.. పెళ్లి ఇంత త్వరగా చేయాలనుకుంటున్నట్లు వివరించారు. ఇక వరుడి విషయానికొస్తే.. వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు.
2016లో రియో ఒలింపిక్స్ (Rio Olympics)లో తొలిసారి బ్రాంజ్ మెడల్ సాధించడంతో పీవీ సింధు పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిందన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 2020లో టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ (Tokyo Olympics)లో కాంస్య పతకాన్ని గెలిచి.. వరుసగా రెండు ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన తొలి ఇండియా బ్యాడ్మింటన్ ప్లేయర్ గా రికార్డుకెక్కింది. నిన్న (డిసెంబర్ 2, సోమవారం) జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషన్ సూపర్ 300 టోర్నీ ఫైనల్ లో గెలిచింది.