సీబీఐకి తమిళనాడు ప్రభుత్వం షాక్.. దర్యాప్తుకు అనుమతిని కంపల్సరీ చేస్తూ ఉత్తర్వులు

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తుకు అనుమతిని ఉపసంహరిస్తూ స్టాలిన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Update: 2023-06-14 17:00 GMT

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తుకు అనుమతిని ఉపసంహరిస్తూ స్టాలిన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో ఇక రాష్ట్రంలో ఏదైనా కేసులో దర్యాప్తు చేపట్టాలంటే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇక సీబీఐ దర్యాప్తుకు అనుమతిని ఉపసంహరిస్తూ పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కేరళ, మిజోరం, పంజాబ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. కాగా తమిళనాడు మంత్రి వీ సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

Tags:    

Similar News