SSC CHSL Admit Cards: సీహెచ్‌ఎస్‌ఎల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. అడ్మిట్ కార్డుల విడుదల తేదీ ఎప్పుడంటే..?
కేంద్ర ప్రభుత్వ(Central Govt) విభాగాల్లో వివిధ ఖాళీల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ (CHSL) టైర్-2 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) గత ఏప్రిల్ నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ(Central Govt) విభాగాల్లో వివిధ ఖాళీల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ (CHSL) టైర్-2 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) గత ఏప్రిల్ నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 3,712 లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే నెలలోనే ముగిసింది. ఈ నెల 18నా రెండు సెషన్లలో ఆన్‌లైన్(Online)లో విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డుల(Admit cards) విడుదల తేదీని SSC ప్రకటించింది. అభ్యర్థులు రేపటినుంచి(నవంబర్ 12) https://ssc.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల తదితర కేంద్రాల్లో CHSL టైర్-2 పరీక్షలను నిర్వహించనున్నారు.