Dissanayake : రేపటి నుంచి భారత్‌లో శ్రీలంక అధ్యక్షుడి పర్యటన
దిశ, నేషనల్ బ్యూరో : శ్రీలంక(Sri Lanka) నూతన అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే(Anura Kumara Dissanayake) ఆదివారం (ఈనెల 15) నుంచి మూడు రోజుల పాటు (డిసెంబరు 17 వరకు) భారత్‌లో పర్యటించనున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : శ్రీలంక(Sri Lanka) నూతన అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే(Anura Kumara Dissanayake) ఆదివారం (ఈనెల 15) నుంచి మూడు రోజుల పాటు (డిసెంబరు 17 వరకు) భారత్‌లో పర్యటించనున్నారు. ఆయన దేశాధ్యక్షుడి హోదాలో చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ‘‘పెట్టుబడులకు ఆహ్వానం పలకడం, భారత్(India)- శ్రీలంక వాణిజ్య సంబంధాలు’’ అనే అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించనున్న బిజినెస్ ఈవెంట్‌లో దిస్సనాయకే పాల్గొంటారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోడీతోనూ ఆయన భేటీ అవుతారు. ఈసందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ప్రధాన చర్చ జరుగనుంది.
చివరగా బిహార్‌లోని బోధ్ గయ్ సందర్శనకు దిస్సనాయకే వెళ్లనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలతో శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ శ్రీలంకలో పర్యటించారు. ఆ సందర్భంగా దిస్సనాయకేను కలిసి.. భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోడీ తరఫున ఆహ్వానించారు. ఆ ఆహ్వానం మేరకే ఇప్పుడు మన దేశంలో దిస్సనాయకే పర్యటించనున్నారు.