ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మరో 18 రైళ్లు రద్దు

భారీ వర్షాల నేపథ్యంలో ఇటీవల పెద్ద ఎత్తున్న రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే మరో మరో 18 రైళ్లను రద్దు చేసింది.

Update: 2023-12-07 12:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారీ వర్షాల నేపథ్యంలో ఇటీవల పెద్ద ఎత్తున్న రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే మరో మరో 18 రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని కోరింది. ఈ నెల 8న నడవాల్సిన న్యూ తిన్‌సుకియా – బెంగళూరు, న్యూ జాల్పాయ్‌గురి – చెన్నై సెంట్రల్‌, న్యూ తిన్‌సుకియా- కేఎస్‌ఆర్ బెంగళూరు సిటీ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. 9న నడవాల్సిన అగర్తలా-ఎస్‌ఎంవీటీ బెంగళూరులో రైళ్లతో నడవాల్సిన చెన్నై సెంట్రల్‌ -తిరుపతి, ఇవాళ నడవాల్సిన 13 రైళ్లను రద్దు చేసింది. అందులో చెన్నై సెంట్రల్‌- హైదరాబాద్, చెంగల్‌పట్టు- కాచిగూడ రైళ్లను రద్దు చేసింది.

Tags:    

Similar News