Soniya gandhi:జనగణన చేపట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు.. కేంద్రంపై సోనియా గాంధీ ఫైర్

దేశంలో జనగణన చేపట్టే ఉద్దేశం మోడీ ప్రభుత్వానికి లేనట్టుందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శించారు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలను ఇప్పటి వరకు నిర్వహించలేదని ఫైర్ అయ్యారు.

Update: 2024-07-31 15:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో జనగణన చేపట్టే sఉద్దేశం మోడీ ప్రభుత్వానికి లేనట్టుందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శించారు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలను ఇప్పటి వరకు నిర్వహించలేదని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘జనాభా గణనను నిర్వహించాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని స్పష్టమైంది. దేశంలోని జనాభా ఎంత ఉందో అంచనా వేయడం ఎంతో ముఖ్యం. దీనిని సాగదీయడం వల్ల ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన సుమారు 12 కోట్ల మంది పౌరులు 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రయోజనాలను పొందలేక పోయారు’ అని వ్యాఖ్యానించారు. వయనాడ్ ఘటనలో నష్టపోయిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. బడ్జెట్‌లో యువత, రైతుల డిమాండ్లను విస్మరించాని, అనేక రంగాల్లో కేటాయింపులు సరిపడా లేవన్నారు. దేశంలో నిరుద్యోగంతో పాటు ధరలు పెరుగుతున్నా వాటిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

అతి విశ్వాసంతో ఉండొద్దు: పార్టీ నేతలకు సూచన

ప్రజలు కాంగ్రెస్ వైపు సానుకూలంగా ఉన్నారని కానీ పార్టీ నేతలు అతి విశ్వాసంతో ఉండొద్దని తెలిపారు. మరికొన్ని రోజుల్లో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోక్ సభ ఎన్నికల్లో ఏర్పడిన ఊపును కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆత్మ సంతృప్తి చెందకూడదని, అతి ఆత్మ విశ్వాసంతో ఉండొద్దని చెప్పారు. ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే జాతీయ రాజకీయాలు సైతం మారిపోతాయని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఎన్నికల్లో మంచి పనితీరు కనబర్చాలని పార్టీ నేతలకు సూచించారు. 

Tags:    

Similar News