లోక్‌సభ ఎన్నికల బరిలో స్మగ్లర్ వీరప్పన్ కూతురు.. ఆ పార్టీ నుంచే పోటీ..

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి అందరికీ తెలిసిన విషయమే. వీరప్పన్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన కూడా ఆయన గురించి ఇంకా ఎవరు మరిచిపోలేదు.

Update: 2024-03-25 11:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి అందరికీ తెలిసిన విషయమే. వీరప్పన్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన కూడా ఆయన గురించి ఇంకా ఎవరు మరిచిపోలేదు. ఆయన జీవిత చరిత్రపై కూడా అనేక సినిమాలు వచ్చాయి. అయితే వీరప్పన్ కూతురు విద్యా రాణి వీరప్పన్ మరోసారి వార్తల్లో నిలిచింది. విద్యారాణి త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఆమె తమిళనాడులోని కృష్ణగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.

విద్యారాణి 2020లో బీజేపీలో చేరారు. రాష్ట్ర యువజన విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పని చేశారు. ఈ క్రమంలోనే నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే)లో చేరి తాజాగా బీజేపీకి గుడ్ బై చెప్పారు. జరగబోయే ఎన్నికల్లో నామ్ తమిళర్ కట్చి పార్టీ తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలతో పాటు పుదుచ్చేరి స్థానంలో కూడా పోటీ చేస్తుంది. కాగా, విద్యా రాణి మూడో తరగతి చదువుతున్న సమయంలో తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని గోపీనాథమ్‌ గ్రామంలోని తాతయ్య ఇంట్లో తన తండ్రి వీరప్పన్‌ను కలిశారని, తను వీరప్పన్‌ను కలవడం అదే మొదటి, చివరి సారి అని పార్టీ టికెట్ కేటాయించిన సందర్భంగా విద్యా రాణి గుర్తు చేసుకున్నారు.

Tags:    

Similar News