ప్రధాని మోడీ ప్రచారంలో ఆరుదేశాల రాయబారులు
ప్రధాని మోడీ బహిరంగ సభలో ఆరుదేశాల రాయబారులు పాల్గొన్నారు. సింగపూర్, నేపాల్ రాయబారులు సహా 20 మంది దౌత్యవేత్తల బృందం మోడీ బహిరంగ సభలో పాల్గొంది.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ బహిరంగ సభలో ఆరుదేశాల రాయబారులు పాల్గొన్నారు. సింగపూర్ హై కమిషనర్ సైమన్ వాంగ్, నేపాల్ రాయబారి శంకర్ పి శర్మతో సహా 20 మంది దౌత్యవేత్తల బృందం మోడీ బహిరంగ సభలో పాల్గొంది. ఈశాన్య ఢిల్లీలో నిర్వహించిన సభకు మోడీ హాజరయ్యారు. ఆ సభలోనే 20 మంది బృందం పాల్గొంది.
ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు మే 25న ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానంలో బీజేపీ తరఫున మనోజ్ తివారీ బరిలో ఉన్నారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి కన్హయ్య కుమార్‌పై ఎన్నికల బరిలో నిలిచారు.
భారత్ లోని నేపాల్ రాయబారి శంకర్ పి శర్మ మాట్లాడుతూ ఆరుగురు రాయబారులతో సహా.. దాదాపు 20 మంది ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు. నేపాల్ మాదిరిగానే భారత్ లో ఎన్నిక ర్యాలీలు ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని పేర్కొన్నారు.