సిద్ధరామయ్య సంచలన నిర్ణయం.. ఆ 5 హామీలకు ఆమోదం

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య పాలనలో స్పీడ్ పెంచారు.

Update: 2023-05-20 15:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య పాలనలో స్పీడ్ పెంచారు. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన తొలి కేబినెట్ మీటింగ్ లో కర్ణాటకలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన 5 ప్రధాన హామీలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇవే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నారు. గృహలక్ష్మీలో భాగంగా మహిళా పెద్దకు ప్రతి నెల రూ.2వేల ఆర్థిక సాయం చేయనున్నారు.

అన్న బాగ్య పథకం పేరిట దారిద్ర్య రేఖకు దిగువ వున్న కుటుంబాల్లోని ప్రతి సభ్యుడికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం ఇవ్వనున్నారు. యువనిధి పథకంలో భాగంగా నిరుద్యోగ పట్టభద్రులకు రెండేళ్ల పాటు ప్రతి నెలా రూ.3వేలు, 18-25 మధ్య వయసు ఉండి డిప్లమా పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు రూ.1500 ఆర్థిక సాయం చేయనున్నారు. శక్తి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికి ఉచిత ప్రజా రవాణా సదుపాయం కల్పించనున్నారు. రానున్న ఐదేళ్లలో మేనిఫెస్టో లోని ప్రతి పథకాన్ని అమలు చేసేందుకు సర్కారు కృషి చేస్తుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. 

Tags:    

Similar News