SHOCKING INCIDENT: ఇంటికి మరమ్మతు చేస్తుండగా షాకింగ్ ఘటన.. బాత్ టబ్ కింద ‘మరో ప్రపంచం’
వ్వకాల్లో పూర్వకాలం నాటి వస్తువులు కనిపించడం, ఇంటిలోని స్టోర్‌రూమ్‌ను శుభ్రం చేస్తుండగా లేదా ఇంటికి మరమ్మతులు చేస్తున్నప్పుడో మనకు అనుకోని రీతిలో పాతబడిన వస్తువులు కనిపిస్తే చాలా ఆశ్యర్చకరంగా అనిపిస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: తవ్వకాల్లో పూర్వకాలం నాటి వస్తువులు కనిపించడం, ఇంటిలోని స్టోర్‌రూమ్‌ను శుభ్రం చేస్తుండగా లేదా ఇంటికి మరమ్మతులు చేస్తున్నప్పుడో మనకు అనుకోని రీతిలో పాతబడిన వస్తువులు కనిపిస్తే చాలా ఆశ్యర్చకరంగా అనిపిస్తుంది. కాగా ఆ వస్తువులను చూసినప్పుడు మనకు మనసులో ఆనందం కలుగుతుంది. వాటితో ఉన్న అనుబంధం గుర్తుకు వస్తుంది. ఇటువంటి ఘటనే తాజాగా ఓ జంటకు ఎదురైంది. అమెరికాలోని మిచిగాన్ స్టేట్‌కు చెందిన హేలీ గిల్‌మార్టిన్, ఆమె భర్త ట్రెవర్‌లు లేక్ హురాన్ సమీపంలో ఉంటున్నారు. వారు తమ ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఇంటిలోని ఒక బాత్ టబ్‌ను తొలగించాలని భావించారు. పనివారి చేత వారు ఆ బాత్ టబ్‌ను తొలగించగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. బాత్‌టబ్ కింద కొంతవరకు నీటితో నిండిన ఒక గది కనిపించడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఇది వారికి ఎంతో వింతగా అనిపించింది. ఆ భార్యాభర్తలు సాహసం చేసి, ఆ గదిలోనికి వెళ్లారు. నీటితో నిండిన ఆ గదిలో ఒకవైపు నుంచి మరోవైపునకు వెళ్లి గమనించారు. అది ఒక సరస్సుకు దారి తీసున్నదని వారిద్దరు కనుగొన్నారు. దీన్ని అప్పట్లో స్మగ్లింగ్‌కు వినియోగించేవారేమోనని వారు వెల్లడించారు. అయితే కేవలం వీరి ఇంటి వద్దే కాకుండా ఆ చుట్టుపక్కల ఇళ్లలోనూ ఇలాంటి సొరంగాలు ఉన్నట్లు హేలీ గిల్ మార్టిన్, ట్రైవర్ లేక్ హురాన్ గుర్తించారు. కాగా ఆ జంట ఆ బాత్ టబ్‌ను తొలగించి, ఆ ప్లేస్‌ను గేమ్ రూమ్‌గా మార్చాలనుకున్నారని చెప్పుకొచ్చారు.