Missing : 55 మంది ఆచూకీ గల్లంతు.. వరదల్లో పెనువిషాదం

దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో హిమాచల్‌ప్రదేశ్‌లోని షిమ్లా, కులూ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.

Update: 2024-08-10 15:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో హిమాచల్‌ప్రదేశ్‌లోని షిమ్లా, కులూ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వరదల్లో కొందరు ప్రజలు కొట్టుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా చాలామంది ఆచూకీని గుర్తించినప్పటికీ, ఇంకా 55 మంది జాడ తెలియరావడం లేదు.

ఆగస్టు 1 నుంచి వారంతా కనిపించడం లేదు. వరదల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలోని 128 రోడ్ల మీదుగా రాకపోకలు స్తంభించాయి. 44 విద్యుత్ ప్రాజెక్టులు, 67 జల ప్రాజెక్టుల సేవలకు ఆటంకం వాటిల్లింది. వచ్చే 24 గంటల్లో హిమాచల్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.

Tags:    

Similar News