మరో కీలక నేతను అరెస్టు చేసిన ఈడీ

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌లోని రేషన్ పంపిణీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-03-30 15:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌లోని రేషన్ పంపిణీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నార్త్ 24 పరగణాస్‌లోని బసిర్‌హత్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్టు చేసింది. వాస్తవానికి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులను దర్యాప్తు సంస్థలు విచారించడానికి వీలుండదు. దీంతో అతడిని జైలులో విచారించేందుకు అనుమతించాలని శనివారం ఉదయం బసిర్‌హత్ సబ్-డివిజనల్ కోర్టును ఈడీ ఆశ్రయించింది. కోర్టు అనుమతి లభించడంతో వెంటనే బసిర్‌హత్ జైలుకు చేరుకున్న ఈడీ అధికారుల టీమ్.. షేక్ షాజహాన్‌ను సందేశ్‌ఖాలీ ప్రాంతంలో రేషన్ స్కాం, భూకబ్జాలు, మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారాలపై ప్రశ్నించింది. అనంతరం మనీలాండరింగ్ కేసులో షేక్ షాజహాన్‌ను అరెస్టు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఇక అతడిని ఎన్నిరోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించాలనే దానిపై ఈడీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేయనుంది. బెంగాల్ మాజీ ఆహారశాఖ మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్‌ కీలక అనుచరుడే ఈ షేక్ షాజహాన్‌. జ్యోతి ప్రియా మల్లిక్‌‌ను 2023 అక్టోబరులోనే ఈడీ అరెస్టు చేసింది. ఇప్పుడాయన కూడా జైల్లోనే ఉన్నారు.

Tags:    

Similar News