పరారీలో ప్రజ్వల్ తల్లి.. రేవణ్ణ కుటుంబం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

సెక్స్ కుంభకోణం కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ ఇరుక్కున్నారు. రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్‌ ఘటనలో భవానీకి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Update: 2024-06-01 15:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సెక్స్ కుంభకోణం కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ ఇరుక్కున్నారు. రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్‌ ఘటనలో భవానీకి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ కోసం సిట్ అధికారులు ఆమెకు నోటీసులు పంపారు. ఇంటికి వచ్చి విచారిస్తామని పేర్కొన్నారు. మరోవైపు భవానీని అరెస్టు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. దీంతో శనివారం ఉదయం సిట్ అధికారులు హొలెనరసీపురలోని ఆమె నివాసానికి వెళ్లారు. ఆమె అక్కడ లేరు. ఫోన్ కూడా స్విచ్ఛాప్ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. భవానీ పరారీలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె దరఖాస్తు చేసుకోగా.. కోర్టు దాన్ని తిరస్కరించింది.

ప్రజ్వల్ ని చుట్టుముట్టిన వివాదాలు

కర్ణాటక హసనలో లోక్‌సభ ఎన్నికలు జరిగిన మరుసటిరోజే అశ్లీల వీడియోల వ్యవహారం బయటికొచ్చింది. అప్పటికే ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీకి పారిపోయారు. ఆయన తండ్రి రేవణ్ణపై ఆరోపణలు వచ్చాయి. రేవణ్ణను పోలీసులు అరెస్టు చేయగా.. బెయిల్ పై విడుదలయ్యారు. గురువారం అర్థరాత్రి దాటాక బెంగళూరుకు వచ్చిన ప్రజ్వల్ ను ఎయిర్ పోర్టులోనే పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కోర్టులో హాజరు పరచగా.. ఈనెల 6 వరకు కస్టడీకి పంపింది.


Similar News