ఒడిశా అంతటా 'తీవ్ర వేడి'.. భువనేశ్వర్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

రాష్ట్రంలోని 27 నగరాల్లో 41 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలున్నాయని ఐఎండీ డైరెక్టర్ మనోరమ మొహంతి చెప్పారు.

Update: 2024-04-19 08:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర వేడి వాతావరణం ఉండే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. తాజాగా భువనేశ్వర్ ఈ సీజన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 43.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవడంతో ఐఎండీ ఒడిశా అంతటా అత్యధిక ఎండ తీవ్రత హెచ్చరికను జారీ చేసింది. శుక్రవారం.. ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 18-19, 20-21 తేదీల్లో వేడి గాలులు ఏర్పాడే అవకాశం ఉంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అత్యధిక 43.6 డిగ్రీల్ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని, రాష్ట్రంలోని 27 నగరాల్లో 41 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ భువనేశ్వర్ డైరెక్టర్ మనోరమ మొహంతి ఏఎన్ఐతో చెప్పారు. తీర ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన పరిస్థితులను చూడవచ్చు. ఏప్రిల్ 20-21 తేదీల్లో వేడిగాలు కొనసాగుతాయని మొహంతి తెలిపారు. 21 తర్వాత వర్షాలు, ఉరుములు, ఈదురు గాలులతో కొంత ఉపశమనం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని మయూర్‌భంజ్, అంగుల్, నయాఘర్, బలంగీర్, కలహండి వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండనున్నాయని ఆమె హెచ్చరించారు. ఇప్పటికే కియోంజర్, మయూర్‌భంజ్, భద్రక్, బాలాసోర్, కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్, కటక్, ఖుర్దా, ధేన్‌కనల్, జాజ్‌పూర్, నయాగర్, కంధమాల్‌లలో ఎల్లో అలర్ట్ జారీ చేశామని వెల్లడించారు.  

Tags:    

Similar News