Trump : భారత్ కు ఎఫ్ - 35 స్టెల్త్ ఫైటర్ జెట్ ల విక్రయం : ట్రంప్ వెల్లడి
ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi), అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) భేటీ(Meets) రెండు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక, వాణిజ్య, రక్షణ రంగాల ఒప్పందాల దిశగా కీలక నిర్ణయాలకు వేదికైంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi), అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) భేటీ(Meets) రెండు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక, వాణిజ్య, రక్షణ రంగాల ఒప్పందాల దిశగా కీలక నిర్ణయాలకు వేదికైంది. భారత్ కు ఎఫ్ -35 స్టెల్త్ ఫైటర్ జెట్(F-35 Stealth Fighter Jets) యుద్ధ విమనాలను విక్రయించేందుకు అమెరికా సిద్దంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. ఈ ఏడాది నుంచి భారత్ కు మిలటరీ ఉత్పత్తుల విక్రయయాలను పెంచుతామని వెల్లడించారు. అలాగే అమెరికా-భారత్ ల కోసం అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నామని..త్వరలోనే ఆ భారీ ఒప్పందాన్ని ప్రకటిస్తామని ట్రంప్ తెలిపారు.
రెండు దేశాలు ఇంధనంపై ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని, భారతదేశానికి అమెరికా చమురు, సహజవాయువు సరఫరాదారుగా మారబోతుందని ట్రంప్ ప్రకటించారు. భారత్ నుంచి ఇజ్రాయిల్ వరకు, ఆ తర్వాత అమెరికా వరకు వాణిజ్య మార్గం సాగుతుందని.. మా భాగస్వామ్య దేశాలను రోడ్లు, రైల్వేలు, సముద్ర కేబుల్స్ ద్వారా కలుపుతామని ఇండియా- మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్(IMEC) గురించి ట్రంప్ మాట్లాడారు. అమెరికా అణు సాంకేతిక ప్రవేశాన్ని సులభతరం చేయడానికి భారత్ తన చట్టాలను సంస్కరిస్తోందని.. వారు మన చమురు, గ్యాస్ ను ఎక్కువగా కొనుగోలు చేయబోతున్నారని.. భారత్ అమెరికా కోసం మేము అద్భుతమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాము" అని ట్రంప్ తెలిపారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ రెండు దేశాలు పరస్పర వాణిజ్య, రక్షణ ఒప్పందాలు చేసుకోబోతుున్నాయని..అమెరికాలో చమురు, గ్యాస్ వాణిజ్యంపై దృష్టి పెడుతామని, 2030నాటికి 500బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే మా లక్ష్యమన్నారు. భారత్ అమెరికా కలిస్తే మెగా భాగస్వామ్యం అని మోడీ చమత్కరించారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్(maga) అనే నినాదం ఇచ్చారని..దీనిని నుంచి స్ఫూర్తిగా తాను మేక్ ఇండియా గ్రేట్ అగైన్(miga) నినాదం ఇస్తున్నామని, మాగా, మిగా కలిస్తే మెగా భాగస్వామ్యం అవుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.