కొత్త ఎంపీల జీతం.. అలవెన్సులు ఎంతో తెలిస్తే షాక్..!
2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4 వ తేదీన వెలువడ్డాయి.
దిశ, వెబ్‌డెస్క్: 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4 వ తేదీన వెలువడ్డాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గానూ ఎన్డీఏ (NDA)కూటమి 293, ఇండియా అలయన్స్ 234, ఇతరులకు 16 సీట్లు వచ్చాయి. అయితే మన దేశంలో ఎంపీకి ఎంత జీతం వస్తుంది? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో జనాలు సోషల్ మీడియా వేదికన చర్చించుకుంటున్నారు. ప్రతి నెల ఎంపీ రూ.1,00,000 జీతం పొందుతారు. రోజువారీ భత్యం(అలవెన్స్): రూ. రూ.2,000 అందుతుంది. అలాగే నెలకు రూ. 70 వేల నియోజకవర్గ అలవెన్స్ వస్తుంది. ఆఫీసు ఖర్చుల భత్యం: రూ. నెలకు రూ. 60,000. (ఇందులో రూ. 20,000/- స్టేషనరీ వస్తువులు, తపాలా ఖర్చుల కోసం) ఢిల్లీ నివాసం, నియోజకవర్గ నివాసం. ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం మూడు టెలిఫోన్‌లకు సంవత్సరానికి 1,50,000 ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఢిల్లీలో ఉచిత వసతి కల్పిస్తారు. సంవత్సరానికి 50,000 యూనిట్ల విద్యుత్ (25,000 యూనిట్లు ప్రతి లైట్/పవర్ మీటర్ లేదా కలిపి), సంవత్సరానికి 4,000 లీటర్ల నీరు ఫ్రీ. రిటైర్డ్ ఎంపీలకు కనీస పెన్షన్ రూ. నెలకు రూ.25,000 వస్తుంది. ఎంపీ, ఆయన భార్యకు ఏటా 34 సార్లు ఉచిత విమాన ప్రయాణం. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ లో జర్నీ ఉంటుంది. ఇలా మొత్తంగా ఎంపీ నెల జీతం రూ. 2. 30 లక్షల మేర లభిస్తుంది.